LIC : జీవితాంతం నెలకు రూ.12,500 ఇచ్చే పథకం .. 40 ఏళ్ల నుంచే చేతికి డబ్బులు !
Pension Plan: మీరు భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? నెల నెలా పెన్షన్ వస్తే బాగుంటుందని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మీరు 40 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ పొందే గొప్ప అవకాశం కల్పిస్తోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC. ఇందులో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే జీవితాంతం నెలకు రూ.12,500 పెన్షన్ పొందవచ్చు. ఆ వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం రండీ.
Pension Plan : ఉద్యోగం చేస్తున్నప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకండా నెల నెలా పెన్షన్ ఇచ్చే పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు. అయితే, పెన్షన్ అంటే 60 ఏళ్ల వయసు దాటిన తర్వాతే వస్తుంది, అంతకన్నా ముందు నుంచే పెన్షన్ (Life Annuity) వస్తే బాగుంటుందని కొంత మంది ఆలోచిస్తుంటారు. ముందే రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి వారి కోసం భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో ఒక సారి పెట్టుబడి పెడితే జీవితాంత నెల నెలా పెన్షన్ పొందవచ్చు. 40 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ తీసుకోవచ్చు.
LIC Saral Pension Scheme
అదే ఎల్ఐసీ సరళ్ పెన్షన్ స్కీమ్ (LIC Saral Pension Scheme). ఈ ప్లాన్ కొనుగోలు చేయడం ద్వారా రూ.1000 నుంచి రూ.12,500 వరకు పెన్షన్ పొందవచ్చు. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు జీవితాంతం పెన్షన్ వస్తుంది. అంతే కాదు పాలసీ తీసుకున్న వ్యక్తి మరణానంతరం జీవిత భాగస్వామికి లేదా నిమినీకి పూర్తి పరిహారం చెల్లిస్తారు. మీకు అనువైన విధంగా, మీ సాధ్యమైనంత మేర పెట్టుబడి పెట్టి దానికి తగినట్లుగానే పెన్షన్ పొందవచ్చు. ఈ పాలసీలో ఎలాంటి పెట్టుబడి పరిమితులు లేవు. మీ ఆర్థిక అవసరాలు, లక్ష్యాలకు తగ్గట్లుగా ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఈ ప్లాన్ కొనుగోలు చేసేందుకు 40-80 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. పాలసీ కొనే సమయంలోనే ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. ఈ ప్లాన్ కొన్న ఏడాది నుంచే మీకు పెన్షన్ రావడం మొదలవుతుంది. పాలసీ తీసుకున్న ఆరు నెలల తర్వాత నచ్చకపోతే సరెండర్ చేయవచ్చు. ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటిది సింగిల్ లైఫ్ ప్లాన్. ఇందులో పాలసీదారు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ ఇస్తారు. ఆ తర్వాత నిమినీకి పెట్టుబడి మొత్తం ఇస్తారు. ఇక రెండో ఆప్షన్ జాయింట్ లైఫ్ పాలసీ. ఇది భార్యాభర్తలు కలిసి తీసుకోవచ్చు. పాలసీదారు మరణించే వరకు పెన్షన్ అందుకుంటారు. ఆ తర్వాత భాగస్వామికి పెన్షన్ ఇస్తారు. ఇద్దరూ మరణిస్తే డిపాజిట్ మొత్తం నామినీకి చెల్లిస్తారు.
ఉదాహరణకు 42 ఏళ్ల వయసు ఉన్న ఓ వ్యక్తి రూ.30 లక్షలు పెట్టి ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన పాలసీ తీసుకున్నారు అనుకుందాం. ఆ ఏడాది నుంచే నెలకు సుమారూ రూ. 12,500 పెన్షన్ అందుతుంది. అయితే పెన్షన్ అనేది పెట్టుబడిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎక్కువ పెట్టుబడికి ఎక్కువ పెన్షన్ వస్తుంది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే తక్కువ పెన్షన్ వస్తుంది. కనీసం రూ.1000 పెన్షన్ వచ్చేలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.